హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్య కేసును ఛేదించిన పోలీసులు

MHBD: ఈనెల 19న జరిగిన ఓ హత్య కేసును తొర్రూరు పోలీసులు ఛేదించారు. ఇవాళ డీఎస్పీ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన గుంటుక రమేష్‌పై అదే గ్రామానికి చెందిన 15 మంది వ్యక్తులు వెంబడించి కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామన్నారు.