హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలి: MPDO

KMR: మద్నూర్ మండలంలోని బీసీ మహిళలు 100% సబ్సిడీతో లభించే ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సాయిలు సూచించారు. అర్హులైన పేద మహిళలు పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 13 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.