హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళపై అడవి జంతువు దాడి..!

SDPT: బెజ్జంకి(M) గూడెం గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న రామవ్వపై గుర్తుతెలియని జంతువు దాడి చేసి కరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. గాయపడిన ఆమెను స్థానికులు అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరిచింది నక్క అని కొందరు, తోడేలు అని మరికొందరు చెబుతుండగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.