హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

WGL: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తేజావత్ వెంకన్న శుక్రవారం కాకతీయ కాలనీ, అశోక కాలనీ, బాలసముద్రం వైకుంఠధామం తదితర ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వైకుంఠ ధామాలను పరిశుభ్రంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్‌వో రాజారెడ్డి, వింగ్ అధికారులు పాల్గొన్నారు.