ఆసిఫాబాద్: కెరమెరి మండలం ఇందాపూర్‌లో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారానికి ఒక్కరోజు మాత్రమే నీళ్లు వస్తుండగా, మరో ఐదు రోజులపాటు సరఫరా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రతిరోజూ మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
తెలంగాణ
ఇందాపూర్ గ్రామంలో తాగునీటి కష్టాలు


