హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు

ASF: కౌటాల మండలం పార్డి మెయిన్ రోడ్డుపై 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. నిత్యం భారీ లారీలు, వివిధ వాహనాలు ప్రయాణించే సమయంలో విద్యుత్ తీగలు తగులుతున్నాయని వాహనదారులు తెలిపారు. కర్రలతో తీగలను పైకి లేపుతూ వాహనాలు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే తీగలను సరిచేసి ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు కోరారు.