హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వాన్నంగా రోడ్డు.. చినుకు పడితే చిత్తడే!

ఆదిలాబాద్: సిరికొండలోని రిమ్మ గ్రామం నుంచి లక్ష్మిపూర్ రహదారి వర్షం పడితే చాలు చిత్తడిగా మారుతోంది. ఎర్ర మట్టితో రోడ్డు ఉండటంతో చినుకు పడితే చాలు రోడ్డంతా చిత్తడిగా తయారవుతోంది. గుంతలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు చొరవ తీసుకుని మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.