హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెల రోజులైనా పూడ్చని కేబుల్ గుంతలు..!

GDWL: పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి రాఘవేంద్ర కాలనీ మార్గంలో భూగర్భ కేబుల్ పనుల కోసం తవ్విన గుంతలను నెల రోజులు గడుస్తున్నా పూడ్చకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై తవ్విన గుంతల వల్ల పాదచారులు, వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని స్థానికులు అంటున్నారు.