VKB: తాండూరులో టాస్క్ ఫోర్స్ సీఐ అన్వర్ పాషా, పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు గంజాయితో వస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పట్టణంలోని విలియంమూన్ చౌరస్తాలో పోలీసులు నిఘా పెట్టి సోదాలు చేశారు. ఈ దాడిలో 1,250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్


