హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులు

MDK: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇంగ్లీష్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఫార్మా కోర్సులలో ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.