హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చట్టాలపై అవగాహన పెంచుకోవాలి'

BHNG: బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలో నిన్న న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత పాల్గొని మాదకద్రవ్యాల నిషేధం, బాల్య వివాహాలు, పోక్సో, చట్టాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం అవయవ దాన పోస్టర్ను ఆవిష్కరించి, అంగన్వాడీ, చైల్డ్ కేర్ కేంద్రాలను సందర్శించారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.