హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఐదు రోజులు తేలికపాటి వర్షాలే..!

NZB: రానున్న 5 రోజులపాటు జిల్లాలో తేలికపాటి, మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. ఉత్తర భారత దేశంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తేమశాతం పెరిగి జిల్లాల్లో ఈ నెల 22 నుంచి 26 వరకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని, మిగతా చోట్ల తేలికపాటి,చిరుజల్లులు మాత్రమే కురుస్తాయని,భారీ వర్షాలకు అవకాశం లేదని స్పష్టంచేశారు.