హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లంపల్లికి 4,961 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 4,961 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 146.50 మీటర్లు, నీటి నిల్వ 16.1350 టీఎంసీలుగా ఉంది. మొత్తం 285 క్యూసెక్కుల నీటిని హెచ్‌ఎండబ్ల్యూఎస్ ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 62 గేట్లు మూసి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.