హైదరాబాద్: 28°C
తెలంగాణ

35 ఏళ్ల యువకుడికి 126 ఏళ్లు!

NRML: నర్సాపూర్ మండల కేంద్రంకు చెందిన 35 ఏళ్ల యువకుడి వయస్సు ముసాయిదా ఓటర్ల జాబితాలో 126 ఏళ్లుగా నమోదైంది. దీంతో ఓటర్ల వివరాల నమోదులో అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొరపాటును వెంటనే సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాగే పేర్లలో కూడా అనేక అక్షర దోషాలు వచ్చాయని వాపోతున్నారు.