హైదరాబాద్: 28°C
తెలంగాణ

40 ఏళ్లుగా శ్రమనే నమ్ముకున్న కష్టజీవి

పెద్దపల్లి: చిన్న కష్టాలకే కుంగిపోయే రోజులివి. కానీ 40 ఏళ్లుగా పల్లీలు, అల్లం మురబ్బా విక్రయిస్తూ సయ్యద్‌ మహబూబ్‌ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎండా, వానా లెక్కచేయకుండా పట్టణంలో తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు. వయసు పెరిగినా శ్రమను వీడకుండా నిజాయితీగా జీవనం సాగిస్తున్నారు. మహబూబ్‌ కష్టజీవితం యువతకు స్ఫూర్తిదాయకమని స్థానికులు కొనియాడుతున్నారు.