హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నేతకు SIT నోటీసులు జారీ..!

HYD: ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా కాంగ్రెస్ నేత కోటూరి మానవతా రాయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని పాత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిట్ ముందు హాజరుకావాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేయనుంది.