సూర్యాపేట జిల్లాలో ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల తాత్కాలిక సర్దుబాట్లలో చోటుచేసుకున్న అసంబద్ధతలను సరిచేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా విద్యాధికారి అశోక్‌కు గురువారం వినతి సమర్పించారు. సమస్యలను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సోంబాబు, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సూర్యాపేటలో ఉపాధ్యాయుల సర్దుబాట్లు సరిచేయాలి'


