హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,114 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,963 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.86 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.