వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగ. ముఖ్యంగా రెండవ శుక్రవారం నాడు ముత్తైదువులు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఇల్లు శుద్ధి చేసి, కలశాన్ని స్థాపించి, లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. అమ్మవారికి తొమ్మిది ముడుల తోరం, పిండివంటలు సమర్పిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, దీర్ఘసుమంగళీ ప్రాప్తం, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
భక్తి
వరలక్ష్మీ వ్రత మహోత్సవ విశిష్టత ఇదే!


