హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 76,464 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,913 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులకు అన్ని వసతులు కల్పించారు.