హైదరాబాద్: 28°C
భక్తి

యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు

TG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. 49 రోజుల పాటు జరిగిన లెక్కింపులో స్వామివారికి రూ.3,52,47,662 నగదు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 114 గ్రా. బంగారం, 3,900 గ్రా. వెండితో పాటు విదేశీ కరెన్సీని కూడా భక్తులు కానుకగా సమర్పించుకున్నారు. ఈవో భవానీశంకర్, ధర్మకర్త నరసింహమూర్తి పర్యవేక్షణలో నిన్న ఈ ప్రక్రియ పూర్తి చేశారు.