హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్‌లో జగన్ పర్యటన

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9:30గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం జలవిహార్‌లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి పయనమవుతారు.