హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గుంతల రోడ్డును బాగు చేయించాలి'

NRML: నిర్మల్ పట్టణంలోని మార్కెట్ నుంచి ఇందిరానగర్ గొల్లపేట వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికి రోడ్డుపై నీరు నిలిచిపోయింది. దీంతో రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల రోడ్డును బాగు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.