హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.