హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్ధరాత్రి అదృశ్యమైన యువతి

MDK: వెల్దుర్తి మండలంలోని ధర్మారంలో 19 ఏళ్ల దివ్య అనే యువతి అదృశ్యమైంది. ఈనెల 19న రాత్రి కుటుంబంతో కలిసి నిద్రించిన ఆమె, అర్ధరాత్రి దాటిన తర్వాత కనిపించకుండా పోయింది. పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ కర్ణాకర్ రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.