హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత సహకార సంఘం భవన నిర్మాణానికి నిధులు

NLG: చిట్యాల చేనేత సహకార సంఘం భవన నిర్మాణానికి తమ వంతుగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించాలని సంఘం అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలంగాణ శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి గురువారం నకిరేకల్‌లో వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు, డైరెక్టర్ మిర్యాల ప్రకాశ్, గంజి కనకయ్య పాల్గొన్నారు.