SDPT: మిరుదొడ్డి మండల పరిధిలోని ధర్మారం వద్ద గురువారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో మోతె గ్రామానికి చెందిన తల్లీకొడుకులు భూమవ్వ, ఎల్లం అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఎల్లం రెండేళ్ల కుమారుడు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బాలుడిని చికిత్స నిమిత్తం దుబ్బాక ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
లారీని ఢీకొని తల్లీకొడుకు మృతి


