MLG: విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వాజేడు పీహెచ్‌సీ వైద్యాధికారి డా. యోషిత అన్నారు. గురువారం కేజీబీవీ, మినీగురుకులంలో వైద్యశిబిరాలు నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కాలానుగుణ వ్యాధులనివారణపై అవగాహనకల్పించారు. కిశోరబాలికలకు HPV టీకా ప్రాధాన్యాన్ని వివరించి, అనంతరం విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు
తెలంగాణ
విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం : డా. యోషిత


