హైదరాబాద్: 28°C
తెలంగాణ

ULC దరఖాస్తుల క్లియరెన్స్‌లో వేగం పెంచండి: కలెక్టర్

MDCL: కలెక్టరేట్‌లోని ULC విభాగాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి నిన్న సాయంత్రం అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. 22ఏ నిషేధిత భూములు, ULC క్లియరెన్స్‌కు సంబంధించి రీటైనబుల్ భూముల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ప్రభుత్వ జీవోల ప్రకారం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.