హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ నుంచి రెండు బ్యాటరీలు చోరీ

KMM: వైరా మున్సిపాలిటీ శాంతినగర్‌ వద్ద ఆగి ఉన్న ఇసుక లారీ నుంచి రెండు బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తున్న లారీని రాత్రి డ్రైవర్‌ శాంతినగర్‌లో రోడ్డు పక్కన నిలిపి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం లారీ వద్దకు వచ్చి స్టార్ట్‌ చేయగా బ్యాటరీలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.