NRML: జిల్లా తానూర్ మండలం ఎల్వీ గ్రామ భీమన్న గుట్టు శివారులో పులి సంచరిస్తుండటంతో స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో పులి అడుగుజాడలు స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. పొలాల వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నామని, వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి పులిని బంధించి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
పులి సంచారం.. భయంలో ప్రజలు


