హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మట్టి రవాణా.. జేసీబీ, ట్రాక్టర్ సీజ్..!

GDWL: సహజ వనరులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉండవెల్లి ఎస్ఐ సురేశ్ హెచ్చరించారు. గురువారం ఉదయం పుల్లూరు వాగులో అక్రమంగా మట్టి తవ్వుతున్న జేసీబీ, ట్రాక్టర్‌ను గస్తీ పోలీసులు రవి, అబ్దుల్ బాషా పట్టుకున్నారు. లాభాల కోసం అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న పుల్లూరుకు చెందిన డ్రైవర్లు ఎండీ భాష, రాజశేఖర్‌లను స్టేషన్‌కు తరలించారు.