హైదరాబాద్: 28°C
తెలంగాణ

దామెరలో కోతుల బెడద.. ప్రజల్లో భయాందోళన

HNK: ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మురళి, డీలర్ షాప్ రవితో పాటు మరో ఇద్దరిని కోతులు కరవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. తరచూ కోతులు దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి కోతులను నియంత్రించి ప్రజలను రక్షించాలని కోరుతున్నారు.