హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరఫరా ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించాలి: కలెక్టర్

JN: జనగామ మండలంలోని ఇప్పలగడ్డ గ్రామంలో ఉన్న గోదామును కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములోని బియ్యం నిల్వలు, నిల్వ సామర్థ్యం, వివిధ మిల్లుల నుంచి బియ్యం సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, బియ్యం సరఫరా ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.