హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుకను మట్టితో కప్పి రూ.79 లక్షలకు గండి..!

MBNR: మిడ్జిల్(M) కొత్తపల్లి సర్వే నంబర్ 96లో వేలానికి సిద్ధంగా ఉన్న 15,829 క్యూబిక్ మీటర్ల సీజ్ చేసిన ఇసుకను మట్టితో కప్పివేశారు. ప్రభుత్వ ఆదాయానికి రూ.79.14 లక్షల నష్టం కలిగించారని గనులు, భూగర్భవనరుల శాఖ ఏడీ తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.