హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సర్'.. మ్యాపింగ్ చేయనివారికి నోటీసులు

RR: రాజేంద్రనగర్‌లో ఈనెల 17న మూసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. నియోజకవర్గంలో మొత్తం 3,88,278 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. 'సర్' కార్యక్రమంలో మ్యాపింగ్ చేయని 99,396 మందికి నోటీసులు ఇస్తామని అధికారులు ప్రకటించారు. నోటీసులు అందుకున్న వారు సరైన పత్రాలను జత చేసి సంబంధిత ఏఈఆర్‌వోలకు అందించాలని సూచించారు. లేదంటే వారి ఓట్లు తొలిగిపోయే అవకాశం ఉందని వివరించారు.