హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తుల సౌకర్యానికి పీవోఎస్‌ మిషన్లు

SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు మరింత సులభతరమైన సేవలు అందించేందుకు పీవోఎస్‌ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇండియన్ బ్యాంక్ అధికారులు ఆలయ సిబ్బందికి మిషన్ల వినియోగంపై డెమో నిర్వహించారు. మరో 2–3 రోజుల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా రుసుములు చెల్లించే అవకాశం ఉంటుంది.