ASR: దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రతే ప్రధాన ఆయుధమని RV నగర్ PHC వైద్యాధికారిణి డా.రోజీ వినీతాంజలి అన్నారు. గురువారం రాత్రి చింతపల్లిలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానవహారం చేపట్టి, వేపాకులు దహనం చేసి పొగతో దోమలను తరిమే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చింతపల్లిలో వేపాకు పొగతో దోమలకు సెగ


