HNK: టీకాల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఐవో డాక్టర్ కృష్ణారావు సూచించారు. కమలాపూర్, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వ్యాక్సిన్ నిల్వలు కోల్డ్‌చైన్ నిర్వహణ,గర్భిణులు, చిన్నారుల ఇమ్యునైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. టీకాల ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించి,షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించాలని వైద్యులను ఆదేశించారు.
తెలంగాణ
టీకాల నిర్వహణలో నాణ్యత పాటించాలి: డీఐవో


