హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సహస్రనామ కుంకుమార్చన

BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా నేడు అమ్మవారికి సామూహిక సహస్రనామ కుంకుమార్చన నిర్వహించనున్నారు. మిథిలా స్టేడియంలో సాయంత్రం 4 - 5 గంటల వరకు ఈ పూజ జరగనుంది. భక్తులు రూ.200 టికెట్ రుసుము చెల్లించి పాల్గొనవచ్చని ఆలయ ఈవో దామోదర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.