హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్లకు గడువు పెంపు

ASF: ఓపెన్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్లకు ఈనెల 31 వరకు గడువుందని ఆసిఫాబాద్ డీఈవో సచ్చిదానంద చారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో జిల్లాలోని ఏపీఎం సెంటర్ల కోఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.