WGL: సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఎస్సీ,ఎస్టీ కేసుల పరిష్కారం, బాధితులకు పరిహారం, భూ సమస్యలపై చర్చించారు. పరిహారం చెల్లింపులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, సకాలంలో న్యాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ
'బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి'


