హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

ASF: సిర్పూర్(T) మండలంలోని లోనవెల్లి నుంచి మండల కేంద్రం మీదుగా అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు SI సాగర్ తెలిపారు. పోలీసుస్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎరుగురాల కుమార్, గొంటి సత్యనారాయణ, అగుర్ల శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.