JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ హుండీ ద్వారా రూ.5,11,472 ఆదాయం సమకూరినట్లు ఈవో చిందం వంశీ తెలిపారు. మార్చి 24 నుంచి ఆగస్టు 20 వరకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం ఆలయ మండపంలో లెక్కించారు. నల్గొండ ఏసీ భాస్కర్‌రావు పర్యవేక్షణలో జరిగిన లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ ఈదులకంటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సిద్ధేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు


