JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట జడ్పీ పాఠశాలను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన దత్తత తీసుకున్నారు. పాఠశాల వసతులు, పదో తరగతి ఫలితాలు, నోట్‌బుక్స్ పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసనంపై ఉపాధ్యాయులతో చర్చించారు. తన పిల్లలను ఇదే పాఠశాలలో చదివిస్తున్న ఉపాధ్యాయుడిని అభినందించి సన్మానించారు.
తెలంగాణ
పాఠశాలను దత్తత తీసుకున్న బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు


