హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ

HNK: హసన్‌పర్తి(M)బావుపేట క్రాస్‌రోడ్డు సమీపంలోని తిమ్మాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి చదువు, భోజనం, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.