ADB: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుష అన్నారు. గురువారం పట్టణంలోని గాంధీ పార్కులో వన మహోత్సవంలో భాగంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ పాల్గొని పూల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. చెట్లతోనే పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన వాతావరణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: బండారి అనుష


