హైదరాబాద్: 28°C
తెలంగాణ

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు

WNP: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని కొత్తకోట ఎస్‌ఐ విక్రమ్ హెచ్చరించారు. తనిఖీల్లో పట్టుబడితే తొలిసారి బైండోవర్ చేసి కోర్టుకు పంపిస్తామని,మళ్లీ పట్టుబడితే జరిమానా లేదా జైలు శిక్ష తప్పదన్నారు. శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బహిరంగ మద్యపానాన్ని అరికడతామని తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా పోలీసులకు సహకరించాలన్నరు.