HNK: దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కిన్నెర అభిలాష్ (31)మృతి చెందాడు. రోడ్డు దాటుతుండగా గుడెప్పాడ్ వైపు నుంచి హనుమకొండకు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కారు ఢీకొని యువకుడి మృతి


