హైదరాబాద్: 28°C
తెలంగాణ

తమ్ముడిని కాపాడబోయి అన్న మృతి

BHPL: గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం ఊర చెరువులో జేసీబీతో తీసిన గుంతలో పడిపోయిన తమ్ముడు దేవేందర్‌ను కాపాడేందుకు వెళ్లిన తోట రాజు (38) నీటిలో మునిగి మృతిచెందాడు. గ్రామస్థులు దేవేందర్‌ను సురక్షితంగా బయటకు తీసిన, రాజును కాపాడలేకపోయారు. మృతుడికి భార్య రమ్య, ఒక కుమార్తె ఉన్నారు.